సూర్యాపేట జిల్లా:యూసీమాస్ 6 వ స్టేట్ లెవల్ గణిత పోటీలు అక్టోబరు 30 న జరిగాయి.ఇందులో 700 మందికి పైగా విద్యార్థులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు.
అందులో భాగంగా సూర్యాపేటకు చెందిన 14 మంది విద్యార్థులు వివిధ కేటగిరీలలో విజేతలుగా నిలిచి ప్రతిభను చాటుకున్నారు.ఇందులో ఇందిర మాడ్యూల్ ఛాంపియన్ గా విజ్వల్ ధీర్,ఉజ్వల్,సుదీక్ష,జాయ్ సామ్సన్ లు ఛాంపియన్ లుగా నిలవగా,సాయి హర్షిత్,సహస్ర, వైభవ్,సాయి రక్షిత్,సాయి సుహాస్ రన్నరప్ లుగా మరియు శ్రీ చరణ్,భవ్య శ్రీ,ఈశ్వర్,సాయి పవన్ లు మెరిట్ గా నిలిచారు.
ఈ సందర్బంగా కాకతీయ పాఠశాల కరస్పాండెంట్ రమేష్ విద్యార్థులను అభినందించారు.







