కమల్ హాసన్ రాసిన నవల ఆధారంగా వచ్చిన మానవ మృగంలాంటి సినిమా !

సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ తెల్సిన అరుదైన వ్యక్తుల్లో కమల్ హాసన్.ఆయనకు సినిమా తెలుసు.సినిమా మొత్తం తెలుసు.అందుకే హీరో గా ఉన్నప్పటికీ డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారు.కానీ దర్శకుడు బాల చందర్ మాత్రం డైరెక్టర్ నువ్వు ఎప్పుడు అయినా అవ్వచ్చు కానీ నటించడం ఆలా కాదు అంటూ ఆయనను నటన వైపే ఉంచడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారు.అప్పట్లో అయన హీరో గా యంగ్ స్టేజ్ లో ఉన్నప్పటి సంగతి.

 Kamal Haasan Novel Turns Into Movie, Kamal Haasan, Directed By Bala Chander, Daa-TeluguStop.com

ఆ గ్యాప్ లో కమల్ హాసన్ ఒక వైపు నటిస్తూనే మరో వైపు కథలు రాయడం మొదలు పెట్టారు.ఆలా రాసి ఇదయం పేసిగిరదు అనే మ్యాగజిన్ కోసం పంపేవారు.

అలా పుట్టిన నవల పేరు దాయం.అంటే డైస్.వైకుంఠపాళి లో వేస్తాము కదా అది అన్నమాట.ఆలా దాయం నవల మ్యాగజిన్ లో రావడం తో చాల పెద్ద హిట్ అయ్యింది.

అప్పట్లో ఇంకా కమల్ స్వాతి ముత్యం వంటి సినిమాలో నటించలేదు.ఆ నవల ను సినిమా గా తీయాలని బాలచందర్ చేయలేదు.ఎందుకంటే అది చాల అడ్వాన్సుడ్ స్క్రిప్ట్ అని అయన ఫీల్ అయ్యారు.1980 ల ప్రాంతాల్లో వచ్చిన ఈ నవల, సినిమా గా మారడానికి 20 ఏళ్ళు పట్టింది.1999 లో కలైపులి థాను గారి బ్యానర్ లో డైరెక్టర్ సురేష్ కృష్ణ సినిమా చేయాల్సి ఉంది.కమల్ హాసన్ ని హీరో గా కమిట్ చేసారు.

అయితే అప్పుడు అయన రెండు కథలు అనుకోని నిర్మాత కి చెప్పారు.అవే బ్రహ్మచారి, నల దమయంతి.కానీ ఆ రెండు కథలను నిర్మాత థానే రిజెక్ట్ చేసారు.అప్పుడు కమల్ హాసన్ తాను రాసిన దాయం నవలను చూపించగా, మరో ఆలోచన లేకుండా ఒకే చేసి వర్క్ స్టార్ట్ చేసి సినిమా గా తీశారు.ఆ సినిమా పేరు అభయ్.2000 ల సంవత్సరంలో విడుదల అయినా ఈ సినిమా తెలుగు లో కూడా అదే పేరుతో డబ్ అయ్యింది.ఈ నవల సినిమాగా అంతగా వర్క్ అవుట్ అవ్వకపోయిన కమల్ హాసన్ కి మంచి పేరు వచ్చింది.మానవ మృగం లాంటి ఈ సినిమా కమల్ హాసన్ రాసిన నవల అనే విషయం చాల మందికి తెలియదు.

ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూడని వారు ఇప్పుడు ఖచ్చితంగా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube