స్టార్ హీరో బాలయ్య సీనియర్ హీరోలలో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అభిమానులకు ఎంతగానో నచ్చేశాయి.
ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నా బాలయ్య( Balakrishna ) మాత్రం పొలిటికల్ కార్యక్రమాల కంటే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.బాలయ్య బాబీ కాంబో మూవీ 2024 సంవత్సరం ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది.
అయితే బాలయ్య హిట్ సినిమాల రికార్డులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో నరసింహ నాయుడు సినిమా( Narasimha Naidu Movie ) ఒకటి కాగా కామవరపుకోటలో ఉన్న లక్ష్మీ టాకీస్ లో ఈ సినిమా కేవలం 10 రూపాయల టికెట్ తో 11 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.
కేవలం 1,80,000 రూపాయలకు ప్రింట్ కొనుగోలు చేయగా ఈ సినిమా ఊహించని స్థాయిలో లాభాలను అందించింది.ఆ థియేటర్ లో నరసింహ నాయుడు క్రియేట్ చేసిన రికార్డ్ ను మరే సినిమా బ్రేక్ చేయలేదు.

పెట్టిన పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమా ఆరు రెట్ల లాభాలను అందించింది.బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో ఈ సినిమా మరోమారు ప్రూవ్ చేసింది.బాలయ్య సినిమాలు ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నాయి.బాలయ్య బాబీ కాంబో మూవీలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

బాలయ్య బాబీ( Director Bobby ) కాంబో మూవీ ఒకింత హై లెవెల్ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను నిర్మిస్తున్న సితార నిర్మాతలు బాలయ్య సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న బ్యానర్లలో సితార కూడా ఒకటి కావడం గమనార్హం.







