హుజూర్ నగర్ మాజీ తహశీల్దార్ జయశ్రీకి 14 రోజుల రిమాండ్

సూర్యాపేట జిల్లా:గతంలో హుజూర్ నగర్ తాహశీల్దారుగా పనిచేస్తూ రైతుబంధు కుంభకోణానికి పాల్పడ్డ ప్రస్తుత నల్లగొండ జిల్లా అనుముల మండల తాహశీల్దార్ వజ్రాల జయశ్రీతో పాటు హుజూర్ నగర్ ధరణి ఆపరేటర్ జగదీష్ ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.ఈ మేరకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హుజూర్ నగర్ కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు స్వాహా చేశారు.రైతుబంధు నిధులు మింగిన తహశీల్దార్,ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్స్ జారీ చేసి,పట్టాదారులతో కలిసి రైతుబంధు నిధులు పంచుకున్న వైనంపై 420, 406,409,120(b),468,467 IPC సెక్షన్లు క్రింద కేసు నమోదు చేసి హుజూర్ నగర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది.

 14 Days Remand For Former Tehsildar Of Huzur Nagar Jayashree , Huzur Nagar Jayas-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube