సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని మామిల్లగూడెం వద్ద సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీసీ రాజధాని బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది.డ్రైవర్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పి, బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
శనివారం ఖమ్మం నుండి హైదరాబాద్ వెళుతుండగా మామిళ్లగూడెం దగ్గరకు రాగానే ముందు వెళుతున్న డిసిఎం టైర్ పగలడంతో దానిని తప్పించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు, స్థానికులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి పరిశీలించారు.