సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో నకిలీల దందా యథేచ్ఛగా కొనసాగుతుంది.సూర్యాపేట పట్టణంలో నకిలీ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్న నలుగురు అంతర్ రాష్ట్ర ముఠాను గురువారం సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.3 లక్షల 83 వేల విలువైన 959.1 లీటర్ల ఇంజిన్ ఆయిల్,ఒక బజాజ్ ఆటో,ఒక మారుతీ వ్యాన్,4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ నాగభూషణం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణములో గతకొన్ని మసాలుగా నకిలీ ఇంజిన్ ఆయిల్ ఆంధ్రా నుండీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్న నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన మాదాసు నాగదుర్గ ప్రసాద్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ వచ్చేడబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని విజయవాడకు చెందిన తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా గత 4 ఏళ్లుగా ఢిల్లీ నుండీ వివిధ కంపెనీలకు చెందిన క్యాస్ట్రల్,హీరో -4Tబజాజ్ DTS ఇంజిన్ ఆయిల్ డబ్బాలు ఒక లీటర్ డబ్బా రూ.140/- లకు కొనుగోలు చేసి అట్టి ఒక లీటర్ ను రూ.250 /-చొప్పున విజయవాడ దాని పరిసర ప్రాంతాల్లోని నందిగామ,జగ్గయ్యపేట,తెలంగాణలోని కోదాడ ప్రాంతాల్లో అమ్ముతూ ఏకంగా ఒక శ్రీకనక దుర్గా ఏజెన్సిస్ అబ్దుల్ మేరీస్ లూస్ ఆయిల్ పేరిట షాప్ పెట్టి లీటర్ రూ.300 /- నుండీ 400/-లకు అమ్ముతూ ఉండగా 2018 లో కోదాడ పొలిసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారని చెప్పారు.జైలు నుండి వచ్చినాక గత 2 ఏండ్ల నుండీ తిరిగి అదే దందా మొదలుపెట్టి,ఒకేసారి ఢిల్లీ నుండి భారీ మొత్తంలో 2000 లిటర్లు తీసుకు వచ్చి అమ్మకాలు కొనసాగించాడని,ఈ క్రమంలో సంవత్సరం క్రితం సూర్యాపేట పట్టణానికి చెందిన నాగార్జున రెడ్డి షాప్ కు వెళ్లి నకిలీ ఇంజిన్ లీటర్ 250/-ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసి వ్యాన్ లో 500 నుండీ 600 లిటర్లు తీసుకు వచ్చి అతనికి తెల్సినటువంటి రేపాల దేవేందర్ రెడ్డి షేక్ సలీంలతో పాటు మరికొంతమంది కల్సి కల్తీ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సూర్యాపేట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద వ్యాన్ లో ఒక వ్యక్తికి 700 లిటర్లు కావాలని చెప్పగా వ్యాన్ లో ఉంచి అమ్ముచుండగా ఈ కేస్ లో నిందితులైన 4 గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.