సూర్యాపేట జిల్లా:కోదాడలో ఏ పార్టీ అభ్యర్ధిగెలుస్తాడో సర్వేలకు సైతం అంతుచిక్కని పరిస్థితుల్లోశుక్రవారం ఓ ఛానల్ వారుకోదాడ పట్టణంలో చిలుక జోస్యం చెప్పించారు.ఆ చిలుక ముందుగా ఓ కార్డు తీయగా అది చూసిన జ్యోతిష్కుడు బీఆర్ఎస్( BRS ) అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav )గెలుస్తారని చెప్పగా,మళ్ళీ మరో కార్డు తీయించగా రెండవసారి ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi ) గెలుస్తుందని చెప్పడంతోఅందరూ అవాక్కయ్యారుదీనిపై అక్కడున్న కొందరిని
మీడియా పలుకరించగా ప్రస్తుతం కోదాడలో ఓటర్ల నాడి కూడా ఇలాగే కన్ఫ్యూజన్ లో ఉందని, చివరికి చిలుక జోస్యం కూడా ఓటరు నాడిని అందుకోలేక పోయిందని, సర్వేలను,చిలుకజోస్యాన్ని నమ్మే బదులు ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తే గుండెల్లో పెట్టుకొని గెలుపిస్తారని,ఆ దిశగా నాయకులు ఆలోచించాలని చురకలంటించారు.