సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాలో కాళేశ్వర జలాల ద్వారా సంవృద్దిగా రెండు పంటలకు సాగునీటి అందిస్తూ రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Guntakandla Jagadish Reddy )అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా చివ్వెంల మండలం డిబిఎం- 71 కాలువ వద్ద సాగునీటి దినోత్సవ వేడుకల్లో భాగంగా అంబరాన్నంటే సంబరాలల్లో ఆయన పాల్గొని గోదావరి జలాలకు ( Godavari water )హారతి కార్యక్రమం నిర్వహించారు.
నాగారం మండలం ఈటూరు నుండి పెన్ పహాడ్ మండలం రావి ఖమ్మం పహాడ్ చెరువు వరకు 68 కిలో మీటర్లు 126 గ్రామాల పరిధిలో ప్రవహించే గోదావరి జలాలుకు హారతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమృద్ధిగా పారే జలాల వలన జిల్లాలో పంట సాగు గణనీయంగా పెరిగిందని అన్నారు.
గత పాలకుల వలన రైతులు ఎంతో నష్ట పోయారని సాధించి తెచ్చుకున్న తెలంగాణలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందన్నారు.జిల్లాలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలు లక్ష పదహారు వేల 142 మంది పాల్గొన్నారని వండర్ బుక్ ఆప్ రికార్డ్ లో స్థానం పొందడం జరిగిందన్నారు.
అనంతరం వేదికపై జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, చీఫ్ ఇంజనీర్ రమేష్, ఎస్పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ లను అవార్డు పొందిన సంధర్బంగా మంత్రి ఘనంగా సన్మానించారు.