సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల( Ananthagiri mandal ) పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో ఉన్న పొలాల్లో మోటర్లు రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.15 రోజుల క్రితం లింగయ్య అనే రైతు మోటారును దొంగలు ఎత్తుకెళ్లారు.అది మరవక ముందే గ్రామ శివారులో ఉన్న ట్రాన్స్ఫారం ఎత్తుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో
దిమ్మే నుండి కింద పడేసి వెళ్లిపోయారు.
పడేసిన ట్రాన్స్ఫారం( Transformer ) అలాగే వదిలేస్తే రెండు మూడు రోజుల్లో ఎత్తుకెళ్తారని గ్రామస్తులు అంటున్నారు.
కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ దొంగతనాలు ఎక్కువయ్యాయని భావించిన రైతులు( Formers ) అప్రమత్తమయ్యారు.రాత్రిపూట కూడా పొలాల వద్దకు కాపలా వెళుతున్నట్లు తెలుస్తోంది.
దొంగలను అదుపు చేయాలంటే పోలీసులు రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని,రైతుల మోటార్ల దొంగ తనాలకు పాల్పడుతున్న వారిని త్వరగా పట్టుకొని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.