సూర్యాపేట జిల్లా:1992 లో అప్పటి ప్రభుత్వం సర్వేనెంబర్ 627,628 లోని భూమిని ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారని,అందులో తమకు కేటాయించిన ప్లాట్ నెంబర్ 9 స్థలాన్ని అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జా చేసి,తిరిగి మమ్ముల్ని కులం పేరుతో దూషిస్తూ, మాపైనే దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మోతె మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన పొడపంగు సునీత అనే బాధితురాలు బుధవారం మీడియా తెలిపారు.పొడపంగు శ్రీనివాస్ తండ్రి వెంకటయ్యకు చెందిన భూమిలో నూతనంగా ఇంటిని నిర్మాణం చేస్తున్న తమను గ్రామానికి చెందిన కొందరు కులం పేరుతో దూషించి తీవ్రంగా గాయపరిచారని,స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చేసినా ఎస్ఐ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
గత మూడు నెలలుగా జిల్లా కలెక్టర్ నుండి మండల ఎమ్మార్వో వరకు వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నామని,అయినా రెవిన్యూ,పోలీసు అధికారులు మాకు ఎలాంటి న్యాయం చేయలేదని,పైగా మాపైనే అధికారులు దురుసుగా ప్రవర్తించి మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.మాభూమి మాకు ఇప్పించి న్యాయం చేయాలని మోతె తాహాసిల్దార్ ను కోరగా మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ భూమికి మీకు ఎలాంటి సంబంధం లేదని,అది గ్రామ పంచాయితీకి సంబంధించిన అంశమని అంటున్నారని అన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మా భూమి మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని,కులం పేరుతో దూషించి, భౌతిక దాడులుచేసిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని,మాకు వారితో ప్రాణహాని ఉందని,మమ్మల్ని కాపాడి, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.