సూర్యాపేట జిల్లా:మునగాల గ్రామ పంచాయతీలో పనులు చేయకుండా చేసినట్లు చూపించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో అధికారులతో కొమ్మక్కై నిధులు దుర్వినియోగం చేశారని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మరో రూ.50 లక్షల దుర్వినియోగం చేశారని సోమవారం జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో మునగాలకు చెందిన స్థానికులు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లడుతూ ఈ అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.మునగాల పంచాయతీ సెక్రెటరీని సస్పెండ్ చేసిన నెలరోజుల లోపే తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చారని,ఇచ్చిన పోస్టింగ్ వెంటనే రద్దు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.







