కోదాడలో యాంకర్, సినీనటి అనసూయ సందడి...!

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలో సోమవారం సినీనటి,ప్రముఖ యాంకర్ అనసూయ సందడి చేశారు.పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న యువతి మహిళా వస్త్ర ప్రపంచం షాపింగ్ మాల్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

 Anchor Anasuya In Kodada Shopping Mall Opening-TeluguStop.com

షాపింగ్ మాల్ పై అంతస్తులో ఉన్న సరికొత్త వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు.నాణ్యమైన వస్త్రాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని నిర్వహకులకు సూచించారు.

కాగా భారీగా తరలివచ్చిన అభిమానుల కోరిక మేరకు పాటలకు స్టెప్పులేసి యువతలో జోష్ నింపారు.ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యువకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.

అంతకుముందు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత, నమ్మకమైన వస్త్రాలను అందించి మహిళల మన్ననలు పొందాలన్నారు.

అనంతరం షాపింగ్ మాల్ నిర్వాహకులు మాట్లాడుతూ కోదాడ ప్రాంతం నుండి హైదరాబాద్,విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా కోదాడలోనే మగువల మనసు దోచే యువతి, మహిళా వస్త్ర ప్రపంచం షాపింగ్ మాల్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ నిర్వాహకులు కొప్పు రామారావు, తాటికొండ బద్రీనాథ్, అమర్ నాథ్,బండ్ల రాధాకృష్ణ,మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ,కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,బీఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి అజంతా భాస్కర్,పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు,వెంపటి మధుసూదన్,స్థానిక కౌన్సిలర్ కోళ్ల కోటిరెడ్డి, కనగాల నాగేశ్వరరావు, మదీనా,మీరా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube