సూర్యాపేట సిగలో మరో మణిహారంగా సమీకృత విద్యుత్ సర్కిల్ భవనం

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట సిగలో మరో మణిహారం మెరవనుంది.సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయం మంజూరు అయ్యింది.

 Another Beautifully Integrated Power Circle Building In Suryapet Siga-TeluguStop.com

ఈ మేరకు టి ఎస్ఎస్ పిడిసిఎల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఒకే చోట సర్కిల్ (ఎస్) కార్యాలయం,డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంతో పాటు సబ్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం,ఈఆర్ఓ కార్యాలయం భవనాలు నిర్మించేందుకు గాను ఏడూ కోట్ల 15 లక్షల 61 వేల 885 రూపాయలను మంజూరు చేశారు.

విద్యుత్ వినియోగ దారులకు అనువుగా ఒకే చోట విద్యుత్ కార్యాలయాలు ఉండే విదంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మంజూరు చేయించి,జిల్లా అభివృద్ధిపై మరోసారి తనదైన ముద్ర వేసుకున్నారు.ఒకే పని మీద విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన చేసుకోకుండా ఉండేందుకు చేసిన ఈ ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రాంగణంలో ఈ సమీకృత కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు.ఈ మేరకు ఈ నెల 30 న భవన నిర్మాణ పనులను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా జరిపించేందుకు విద్యుత్ శాఖాధికారులు నిర్ణయించారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేటలో ఇప్పటికే మెడికల్ కళాశాల,సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎస్పి కార్యలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో ప్రగతి వైపు పరుగులు పెడుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ స్టోర్స్ ను మంజూరు చేయించడంతో మారుమూల రైతాంగానికి పని సులువుగా మారింది.దానికి తోడు ఏకంగా జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్ శాఖా కార్యాలయాల భవనాలు నిర్మించడతో ఇకపై విద్యుత్ వినియోగ దారులకు పనులు సులభతరమౌతాయని ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube