సూర్యాపేట జిల్లా:తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో “మాతృ దినోత్సవ” ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఎందరో బిడ్డలకు జన్మనిచ్చిన మాతృమూర్తులు,అందరి ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్య ఆరోగ్య శాఖ మహిళా సిబ్బంది అందరికీ ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలకు అంతర్జాతీయ “మాతృ దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేశారు.
సుదీర్ఘకాలంగా వైద్యఆరోగ్యశాఖ నందు సేవలందించిన విశ్రాంత కమ్యూనిటీ హెల్త్ అధికారి మేరీ నిర్మలను మాతృ దినోత్సవ సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందించడం జరిగింది.వైద్య ఆరోగ్య శాఖలో 38 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం అందరి మన్ననలుతో ఉద్యోగ సేవలందిస్తూ,కుటుంబ పరంగా కూడా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నింటినీ అధిగమిస్తూ కుమారులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించిన మేరీ నిర్మల అభినందనీయురాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ అన్నారు.
ఇలాంటి మాతృమూర్తులు అందరూ నేటి తరానికి ఆదర్శనీయు లని ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు,జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ,వైద్య కళాశాల సహాయ ప్రొఫెసర్ డాక్టర్ లిసి వినయ్,రెండవ ఏఎన్ఎం ల అధ్యక్షురాలు జానీ బేగం,యూనియన్ డివిజన్ అధ్యక్షుడు వాంకుడోత్ వెంకన్న,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి సంధ్య,విజయ తదితరులు పాల్గొన్నారు.