నేను చాలా స్ట్రాంగ్.. ఎందుకంటే మా అమ్మ నన్ను అంత దైర్యంగా పెంచింది: హిమజ

తెలుగు బుల్లితెర, వెండితెరకు పరిచయమున్న నటి హిమజ పరిచయం గురించి అందరికి తెలిసిందే.బుల్లితెరలో పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 I Am Very Strong Because Of My Mother By Himaja Himaja, Tollywood, Comment, Moth-TeluguStop.com

అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనకు ఒక పేరు సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది.

నిత్యం తన ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది.

హిమజ తొలిసారిగా భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇక బుల్లితెరపై పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ల గురించి అందరికీ తెలిసిందే.

కాగా బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ లో హిమజ ఒకరు.బిగ్ బాస్ తర్వాత హిమజ ఇమేజ్ మొత్తం మారింది.సోషల్ మీడియాలో తెగ పోస్టులతో బిజీగా ఉంటుంది.

Telugu Bharyamani, Biggboss, Himaja, Mother, Serials, Swayamvaram, Tollywood-Mov

ప్రస్తుతం హిమజ ను చూస్తే మాత్రం ఒకప్పటి హిమజ కు ఇప్పటి హిమజ కు చాలా తేడా ఉంది.లంగవోణి లుక్ తో‌ పరిచయమైన హిమజ ప్రస్తుతం పొట్టి పొట్టి దుస్తులతో గ్లామర్ ను పెంచుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే హిమజ నిత్యం తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న క్షణంలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇటీవలే యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.ఇక ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసింది.

దీంతో ఈమెకు మరింత క్రేజ్ పెరిగింది.అలా ఓ వైపు పలు ప్రాజెక్టులతో పాటు వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.

Telugu Bharyamani, Biggboss, Himaja, Mother, Serials, Swayamvaram, Tollywood-Mov

ఇక బుల్లితెరపై ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొని బాగా సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మదర్స్ డే సందర్భంగా బుల్లి తెర పై నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాల్గొంది.ఇక దానికి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తన తల్లితో పాటు మరో సెలబ్రెటీల తల్లులు కూడా ఉన్నారు.ఆ ఫోటోని షేర్ చేసుకుంటూ.

తను చాలా స్ట్రాంగ్ అని.ఎందుకంటే తన తల్లి తనని అంత ధైర్యంగా పెంచింది అని తెలిపింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇటీవలే ఆ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోలో హిమజ తల్లి తన పెళ్లి విషయంలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube