మునగాల మండల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి( Government Hospital ) ఎదురుగా ఉన్న ప్రయాణ ప్రాంగణంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు.అక్కడ సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో కొందరు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో నిలువ నీడ లేక బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 Conditions Of Travelers In Munagala Mandal Centre-TeluguStop.com

దీనిపై అనేకసార్లు జిఎంఆర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో అక్కడ దుకాణ సముదాయాలను తొలగించాలని జిఎంఅర్ ప్రతినిధులు చెప్పినా ఇంత వరకు అమలు కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నేషనల్ హైవే 65 కు ఆనుకొని ఉండటంతో మండల కేంద్రంలో బస్సు స్టాప్ తో పాటు రోడ్డు క్రాసింగ్ కూడా ఇక్కడ నుండే చేయాలని, తాత్కాలిక దుకాణాలతో రోడ్డుపై నిలబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

ఇప్పటికైనా జిఎంఆర్( GMR ) యాజమాన్యం,స్థానిక అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణకు గురైన ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో తాత్కాలిక దుకాణాలను తొలగించి, ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారుమునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో తాత్కాలిక దుకాణాలను తీసివేసి,బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మీసేవ శర్మ అన్నారు.జిఎంఆర్ అధికారులు చెప్పినా దుకాణాలు ఎందుకు తొలగించడం లేదని,దీనితో తాత్కాలిక దుకాణాలతో ట్రాఫిక్ జామ్ సమస్య( Traffic Jam ) కూడా ఏర్పడుతుందని,వేసవిని దృష్టిలో పెట్టుకొని అధికారులు చర్యలు చేపట్టి,ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube