అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష,10 వేల జరిమానా

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పిఎస్ పరిధిలోమైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నేరేడుచర్ల పోలీసులు సంవత్సర కాలంలోనే కేసును విచారణ జరిపి సాక్షులను బాధితులను విచారించి నిందితునికి జైలు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని కోదాడ డిఎస్పి,హుజూర్ నగర్ సిఐని,కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.గురువారం1వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు బాధితులను,సాక్షులను విచారించి అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిందని ఎస్పీ తెలిపారు.నేరేడుచర్ల మండల కేంద్రంలో 2022 సంవత్సరం జనవరి నెల 7వ తేదీన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన ఒంటిపులి కోటేశ్వర్ రావు(27) ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించి నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ నందు పోక్సో చట్టం 2012, ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ చట్టం 1989 ప్రకారం నేరం సంఖ్య 10/2022 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

 20 Years Imprisonment And 10 Thousand Fine In Rape Case-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారులు అప్పటి కోదాడ డిఎస్పీ రఘు,నేరేడుచర్ల ఎస్ఐ నవీన్ కుమార్ విచారణ జరిపి నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేశారని,దీనిపై పూర్తి సాక్షాధారాల ప్రకారం సాక్షులను,మరియు బాధితులను విచారించిన 1వ అదనపు సెషన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ప్రేమలత నిందుతుడు వంటిపులి కోటేశ్వర్ రావు నేరానికి పాల్పడినాడని నిర్ధారించి నేరస్థునికి 20 సంవత్సరాల జైలు శిక్ష,10 జరిమానా విధించడం జరిగిందన్నారు.

నేరాలకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్ర పోలీస్ శాఖలో అమలవుతున్న కోర్టు డ్యూటీ ఫంక్షనల్ వర్టికల్ ఆధారంగా సిబ్బంది సామర్థ్యంతో పనిచేసి అతి తక్కువ కాలంలోనే ఈ కేసును ఛేదించి నేరస్తునికి శిక్ష పడేలా కృషి చేయడం, అలాగే బాధితురాలికి న్యాయం చేయడం జరిగిందన్నారు.

బాధితురాలిని భరోసా సెంటర్ నందు నైతికంగా, సామాజికంగా, మానసికంగా కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా కల్పించడం జరిగిందని, అలాగే ప్రభుత్వం నుండి 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందించడం జరిగిందని అన్నారు.ఈ కేసులో బాగా పనిచేసిన చేసిన కోదాడ డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, సిఐ రామలింగారెడ్డి, నేరేడుచర్ల ఎస్ఐ నవీన్ కేమార్ ను,కోర్టు పిపి త్యాగరాజు మరియు కోర్టు డ్యూటీ సిబ్బందిని, నేరేడుచర్ల పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube