రజినీకాంత్ హీరోగా కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన నరసింహ సినిమా చాలా పెద్ద హిట్ అయింది.ఈ స్టోరీ ని చిన్న కృష్ణ రాశారు.
ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా చాలా పెద్ద విజయం సాధించింది.అయితే ఈ సినిమా లో రజినీకాంత్ ని ఎదుర్కొనే పాత్రలో నీలాంబరి గా రమ్యకృష్ణ నటించింది.
ఈ సినిమా లో రజినీకాంత్ కి జోడీగా సౌందర్య నటించింది.ముసలితనం లో ఉన్న క్యారెక్టర్ లో కూడా రజినీకాంత్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు…

ఇక ఇది ఇలా ఉంటే మొదటగా ఈ స్టోరీలో హీరోగా బాలకృష్ణ అయితే బాగుంటుంది అని ఈ సినిమా కథ రాసిన చిన్నికృష్ణ అనుకున్నారట అలా అనుకొనే డైరెక్టర్ బి గోపాల్ కి చిన్నికృష్ణ ఈ కథ చెప్పాడట కానీ అప్పుడు బాలయ్య బాబు తోనే సమర సింహా రెడ్డి సినిమా చేస్తున్న బి గోపాల్ ఈ స్టోరీ ని తరువాత చేద్దాం అలా ఉంచండి అని చెప్పి దాన్ని హోల్డ్ లో పెట్టారట బి గోపాల్ నిర్ణయానికి సరే అని చిన్నికృష్ణ కూడా అలాగే కొద్దిరోజులు ఈ కథని పక్కకి పెట్టారట కానీ అంతకు ముందు ఈ కథ విన్న చిన్నికృష్ణ ఫ్రెండ్ ఈ కథని కే ఎస్ రవికుమార్ దగ్గరికి తీసుకెళ్లారట…

దాంతో ఆయన ఈ స్టోరీ నాకు కావాలి అని తీసుకొని రవి కుమార్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రజినీ కాంత్ ని పెట్టీ ఈ సినిమా తీసాడు…రజినీకాంత్ తన యాక్టింగ్ తో సూపర్ గా చేశాడు కానీ బాలయ్య బాబు ఒక వేళ ఈ సినిమా చేసి ఉంటే రమ్యకృష్ణ పొగరు బోతు క్యారెక్టర్ కి బాలాకృష్ణ చెప్పే డైలాగ్స్ కి పెర్ఫెక్ట్ సెట్ అయ్యేది అని ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు…మొత్తానికి ఒక మంచి క్యారెక్టర్ బాలయ్య మిస్ చేసుకున్నాడని చెప్పాలి…
.