నల్గొండ జిల్లా:అనుముల మండలం పేరూరు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరు శోభన్ బాబు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సేవారత్న, ప్రతిభారత్న అవార్డులు అందుకున్నారు.
హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ ప్రెసిడెంట్ కొంపెల్లి సత్యనారాయణ,రిటైర్డ్ జడ్జి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సుప్రీం కోర్టు న్యాయవాది నేరెళ్ల మల్యాద్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవ సంఘం ఈ అవార్డులు ప్రధానం చేసింది.
ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు,రాజకీయ నాయకులు,స్నేహితులు,బంధువులు అభినందనలు తెలిపారు.







