సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఏడవ వార్డు గోవిందాపురంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కరెంట్ స్తంభానికి ఉన్న లైట్ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేయడంతో రాత్రి వేళ అంధకారం నెలకొంటుంది.
దీనితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోపోవడం ఏంటని వార్డు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.వెంటనే వీధి లైట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.







