సూర్యాపేట జిల్లా:హుజార్ నగర్ పట్టణానికి చెందిన భూక్య నరసింహ దివ్యాంగుడు ఎంకే టీ స్టాల్ నందు సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.చిన్ననాటి నుండి ఒక కాలు అవిటిగా ఉండగా గత రెండేళ్ల క్రితం మరొక కాలు ఇన్ఫెక్షన్ అవడంతో ఆ కాలును కూడా కోల్పోయాడు.
ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని, భార్య,ఇద్దరు పిల్లలతో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని,తనకు ప్రభుత్వం ఉపాధి కల్పించి,ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వేడుకుంటున్నాడు.