నల్గొండ జిల్లా: పెద్దఅడిచర్లపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన కోమండ్ల లక్ష్మయ్య సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్ళి ఉష్ణోగ్రత తీవ్రతకు వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ యజమాని మృతి చెందడంతో దిక్కుతోచని పడ్డామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఉపాధి హామీ పని జరిగే ప్రదేశంలో సేద తీరేందుకు టెంట్ ఏర్పాటు చేయకపోవడంతో ఎండ తీవ్రతకు ప్రాణం పోయిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.







