గర్భస్థ లింగ నిర్ధారణ నేరం:అదనవు కలెక్టర్ బి.ఎస్.లత

సూర్యాపేట జిల్లా:గర్భస్థ లింగ నిర్ధారణ( Gender determination-tests ) నేరమని అదనపు కలెక్టర్ బి.ఎస్.

 Gestational Sex Determination Crime: Additional Collector B.s.latha-TeluguStop.com

లత( Additional Collector B S Latha ) అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 100 రోజులు స్పెషల్ అవేర్నస్ క్యాంపైన్ లో భాగంగా నేడు పిసిపిఎన్డిటి అలాగే ఎంటిపీ చట్టంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమని అన్నారు.గర్భిణులకు స్కానింగ్ అనేది బిడ్డ ఎదుగుదల తెలుసుకోడానికే తప్ప కడుపులో బిడ్డ జెండర్ తెలిపేందుకు కాదని,అలా తెలుసుకొని ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే ఆడపిల్లని చంపేయడం నేరమని అన్నారు.

ఈ సృష్టి ఏర్పాటులో మహిళా యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తూ నేటి సమాజంలో మహిళల ప్రాధాన్యత గురుంచి వివరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంగన్వాడీ,మెడికల్,హెల్త్ డిపార్ట్మెంట్,మెడికల్ ఆఫీసర్స్,ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలకు పిసిపిఎన్ డిటి,ఎంటిపీ చట్టం యొక్క తీవ్రత గ్రామాలలో అందరికి తెలియచేసేలా అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకోవాలని తెలియచేశారు.ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ డా.జయ, మీడియా ఆఫీసర్ అంజయ్య రిసోర్స్ పర్సన్స్ గా పిసిపిఎన్ డిటి,ఎంటిపీ చట్టాల గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు,ఏఎన్ఎంలు, సఖి,అంగన్వాడీ,ఆశాలు మరియు సంకల్ప – మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube