దేశంలోనే తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాల( Welfare development schemes ) అమలులో అగ్రగామిగా నిలిచి,దేశానికి ఆదర్శంగా పురోగమిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) అన్నారు.బుధవారం ఆయన కోదాడ నియోజకవర్గం పరిధిలోని మునగాల మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి/షాది ముభారాక్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.154మంది కళ్యాణలక్ష్మి/షాదిముభారక్ లబ్దిదారులకు కోటి 54 లక్షల 17వేల వేల 864 రూపాయల చెక్కుల మంత్రి పంపిణీ చేశారు.అదే విధంగా 21 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆరు లక్షల 77 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ సంక్షేమ రంగానికి అందులో ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేశారనడానికి కళ్యాణలక్ష్మి/షాదిముభారక్ పథకాలు నిలువెత్తు నిదర్శనమని, ఆడపిల్లల పెళ్లిళ్ల పేరుతో దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు అధిగమించేందుకు గాను ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని కొనియాడారు.అదే విధంగా తరతమ బేధం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదప్రజలకు బాసటగా నిలిచిందన్నారు.
అనారోగ్య సమస్యలతో పాటు ఆకస్మిక ప్రమాదాలకు గురైన వారు ఆసుపత్రుల పాలైతే ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు గాను ముఖ్యమంత్రి సహాయనిధి దోహద పడుతుందన్నారు.
ఆరోగ్య తెలంగాణ కేసిఆర్( CMKCR ) లక్ష్యమని,ముందుగా కోటి 56లక్షల వ్యయంతో నిర్మించనున్న మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యానికి స్వర్గసీమగా తెలంగాణ రాష్టం అవతరించిందన్నారు.ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు.వైద్య రంగంలో దేశానికే తెలంగాణ రాష్టం దిక్సూచి గా నిలబడిందన్నారు.కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం విద్య,వైద్య రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తుందన్నారు.
అటు పల్లెల నుంచి మొదలు, పట్టణాల్లో బస్తీ దవఖానాలతో ఊహలకందని వైద్య సదుపాయాలు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం అంటేనే,నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట వినిపించిన నేలలో నేడు,ప్రభుత్వ వైద్య సేవలు తప్ప ప్రైవేటు సేవల కోసం ఎవరూ చూడడం లేదన్నారు.
ఇప్పటికే తెలంగాణలో పేద,మధ్య తరగతి వర్గాలన్నీ ప్రభుత్వ వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
తెలంగాణలో వున్న అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా టెస్టులు కూడా చేస్తున్నామన్నారు.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం అధునాతమైన వైద్య పరికారాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.ఊహించని ఆపరేషన్లు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో చేపడుతున్నామన్నారు.
ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కలల రూపంలో ఒక అద్భుత ఆవిష్కారమని, వైద్యం పేదలకు అందుబాటులోకి తెచ్చిన సాక్ష్యాత్కారం అన్నారు.తెలంగాణలో విద్య, వైద్యం,ఉపాధి రంగాలకు కొదవ లేకుండా చేయడంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చూపిన చొరవ ప్రపంచమంతా కీర్తిస్తోంది.
పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణలో విద్య,వైద్య రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, ఎంపీపీ నరేందర్ రెడ్డి, జెడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు,సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ నిరంజన్, తాహసీల్దార్ జోహార్ లాల్, పంచాయతీరాజ్ డిఇ పాండు నాయక్, సర్పంచులు చింతకాయల ఉపేందర్,ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.