టికెట్ల కేటాయింపుపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలోనే పొత్తులపై చర్చ ఉంటుందని అన్నారు.
సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.తన టికెట్ తో సహా ప్రతి ఒక్కరికీ సర్వేనే ప్రామాణికమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరే వారికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని పేర్కొన్నారు.ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరే ప్రతిపాదన వస్తే టికెట్ పై చర్చిస్తామని వెల్లడించారు.







