మాస్ రాజా ''టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్.. రెస్పాన్స్ అదుర్స్!

మాస్ మహారాజా రవితేజ( Ravi teja ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు” (Tiger Nageswara Rao).డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేసారు.

 Tiger Nageswara Rao First Look Details, Ravi Teja, Pan India Movie, Tiger Nagesw-TeluguStop.com

గత కొన్ని రోజులుగా ఈ ఫస్ట్ లుక్ కోసం వరుసగా అప్డేట్ ఇస్తూ వస్తున్న టీమ్ ఎట్టకేలకు ఈ రోజు చెప్పిన సమయానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిన్న వీడియోతో రిలీజ్ చేసారు.

రాజమండ్రిలోని హావ్ లాక్ బ్రిడ్జ్ మీద గ్రాండ్ గా విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ ఫస్ట్ లుక్ ను తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో ఒక్కో భాషలో ఒక్కో హీరో డిజిటల్ రిలీజ్ చేసారు.నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ముఖ్యంగా వెంకీ వాయిస్ ఈ వీడియోకు బాగా పవర్ ఫుల్ గా సూట్ అయ్యింది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా 1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పిలువబడే స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి ఈ సినిమా తెరకెక్కుతుండగా ఫస్ట్ లుక్ (Tiger Nageswara Rao First Look) అదిరింది.రవితేజ పవర్ ఫుల్ లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి.మరి ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా వ్యాప్తంగా ఆకట్టుకునే అవకాశం కనిపిస్తుంది.

ఇక మిగతా భాషల్లో వాయిస్ ఓవర్ అందించిన స్టార్స్ వాయిస్ కూడా ఈ మోషన్ పోస్టర్ కు సరిపోయింది.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా.

అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

https://youtu.be/7hDM189hGq4
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube