అవినీతి,ఆక్రమణలు ఎవరి హయంలో జరిగాయో బహిరంగ చర్చకు సిద్దామా... ?

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ ఎం‌పి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జునరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,కౌన్సిలర్స్ కోతి సంపత్ రెడ్డి,తేజవత్ రాజా నాయక్,వెలిదండ సరిత, కారింగుల విజయ,బోలెద్దు ధనమ్మ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కడపు మహేష్ లతో కలిసి ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన పత్రిక ముఖంగా వారి స్థాయి మరచి చరిత్ర తెలియకుండా పార్లమెంట్ సభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

 Are We Ready For A Public Debate Under Whose Rule Corruption And Aggression Took-TeluguStop.com

గతంలోనే కాంగ్రెస్ పార్టీ మరియు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ లే అవుట్ స్థలాలను కాపాడాలని హుజూర్ నగర్ బంద్ కు పిలుపునిచ్చి, అప్పటి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ని కలిసి అధికారపార్టీ నాయకలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలని మరియు అన్ని మున్సిపల్ స్థలాలకు ఫిన్సింగ్ చెయ్యాలని పోరాటం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడక ముందు అభివృద్ది పనులకు నోచుకోని హుజూర్ నగర్ ని 2009 లో నూతన నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 3500 కోట్లతో అవినీతికి తావులేకుండా నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ది చేశారో నియోజకవర్గ ప్రజలందరికి తెలుసునన్నారు.

విదేశాల నుండి దిగుమతైన టీఆర్ఎస్ నాయకుడు,ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డిని రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉందని,అభివృద్ది చేస్తాడని,నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఆయన హయంలో ఎంత అభివృద్ది జరిగిందో,ఎంత అవినీతి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.గతంలో అధికార పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కౌన్సిలర్లకు పదవుల ఆశ చూపి, సంతలో పశువుల్లా పార్టీ మార్పిడి చేయించింది నిజం కాదా?ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా ఉండాలని నిరుపేదలకు ఫణిగిరి గట్టు వద్ద మోడల్ కాలనీ 80శాతం పూర్తి చేస్తే,దానికి 20 శాతం నిధులు మంజూరు చేయించలేక,దాన్ని డంపింగ్ యార్డుగా మార్చింది మీరు,మీ నాయకుడు కాదా?ఫణిగిరి గుట్ట రోడ్డులోని జిమ్ ప్రక్కన గల మున్సిపాలిటీ స్థలం 5500 గజాలలో మంత్రి జగదీష్ రెడ్డి కూరగాయల మార్కెట్ కు శంఖుస్థాపన చేసింది నిజం కాదా? మంత్రి శంఖుస్థాపన చేసిన స్థలాన్ని మీ హయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సహాయంతో మీ పార్టీ జిల్లా నాయకులకు సొంతం అయ్యేలా మీరూ,మీ సిబ్బంది కోర్టుకు హాజరు కాకుండా ఎక్స్ పార్టీ అయ్యేలా సహకరించింది నిజం కాదా? మొన్న అడిషనల్ కలెక్టర్ వచ్చినప్పుడు 10 లక్షల రూపాయల బ్లిచింగ్ ఫౌడర్ కొనుగోలు చేయకుండానే లెక్కలో చూపింది నిజం కాదా?మీ మామగారు ఎటువంటి న్యాయపరమైన ఆధారాలు లేకుండా పద్మశాలి భవనం ప్రక్కన మున్సిపాలిటీ స్థలన్నీ కబ్జా చేసింది నిజం కాదా? మీరు,మీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కమీషన్ల కోసం హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు పనులను మున్సిపాలిటీ ద్వారా కాకుండా కలెక్టర్ సహాయంతో పబ్లిక్ హెల్త్ శాఖకు మార్చుకుంది నిజం కాదా? మున్సిపాలిటీ అభివృద్ది నిధులు మున్సిపాలిటీ ద్వారానే (ఎన్నికైన ప్రజాప్రతినిధులు) జరగాలని, పబ్లిక్ హెల్త్ కు మార్చడం సరైన పద్దతి కాదని న్యాయస్థానం మొట్టికాయలు వేసింది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.మీరు జపించే ఎమ్మెల్యే సైదిరెడ్డి సొంత మండలం హుజూర్ నగర్- మట్టపల్లి రహదారి చూస్తే మీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ది ఏమిటో కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.ఒక్కసారి ఆ రహదారిలో వెళ్ళి చూడండన్నారు.

వాస్తవ పరిస్థితులు ఏమిటో నియోజకవర్గ ప్రజలందరికి తెలుసని,2018లో అవినీతి జరిగిందని పత్రిక ప్రకటనలో చెప్పుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ కు మీ పార్టీలో చేరిన అప్పటి చైర్మన్స్ అడగాలని సూచించారు.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనని,ఎవరి హయంలో అభివృద్ది జరిగిందో,అవినీతి జరుగుతుందో ప్రజా కోర్టులోనే నిర్ణయం జరుగుతుందని,మీరు చేసినటువంటి అవినీతి ఆరోపణల మీద బహిరంగ చర్చకి మేము సిద్దంగా ఉన్నామని,మీరు సిద్దమేనా? అని సవాల్ విసిరారు.మీరు మీ స్థాయి మరచి ఎంతో రాజకీయ అనుభవం కలిగిన పార్లమెంట్ సభ్యునిపై చేసిన వ్యాఖ్యలను మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిదండ వీరారెడ్డి,కారింగుల వెంకటేశ్వర్లు,వేముల నాగరాజు, గడ్డం అంజయ్య,కొత్త వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube