సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ వైద్యాధికారును ఆదేశించారు.
గురువారం స్థానిక 12 వార్డు అంబేద్కర్ నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని,ఓపి వివరాలను తెలుసుకున్నారు.
అన్ని వైద్య కేంద్రాలలో మందుల కొరత ఉండొద్దని,ఓపి ఎక్కువగా పెరగాలని సూచించారు.కేంద్రంలోని పేషంట్లు సంగీత, అంజలిని ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ కోసం వేచి ఉన్నామని వారు కలెక్టర్ కి తెలిపారు.పట్టణ వైద్యశాలలో పాము కాటు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉంచాలని,సిబ్బంది హాజరు,ఇతర రిజిస్టర్ లను పరిశీలించారు.
ఫార్మసిస్టును మందుల వివరాలను ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించారు.
స్టాక్ వివరాలను కంప్యూటర్లో పరిశీలించారు.
వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని వైద్యులు వైద్యశాలలో ఉంటూ వైద్య సేవలందించాలని, డాక్టర్స్ కోసం పేషంట్స్ ఎదురు చూసేలా ఉండరాదని సూచించారు.ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది తప్పకుండా డ్రెస్ కోడ్ తో ఉండాలని సూచించారు.
ఈ పర్యటనలో డా.రమ్య, ఫార్మసీస్ట్ సంధ్య, ఏఎన్ఎంలు కృష్ణప్రియ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.