ముగిసిన అర్హత రాత పరీక్ష

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు చేపట్టుతున్న సందర్భంగా జిల్లాలో ఉన్న పేద,మధ్యతరగతి నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీసు అధ్వర్యంలో ముందస్తు ఉచిత శిక్షణ ఇవ్వండం జరుగుతుంది.దీనిలో భాగంగా అభ్యర్థులకు ఎత్తు,ఛాతీ,పరుగు పందాలు నిర్వహించడం జరిగినది.

 Completed Eligibility Written Test-TeluguStop.com

ఫిజికల్ టెస్ట్ నందు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈరోజు జిల్లా కేంద్రంలో గల ఎస్.వి.డిగ్రీ కళాశాల నందు అర్హత రాత పరీక్షా నిర్వహించగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు,సిబ్బంది ఇన్విజిలేటర్ లుగా విధులు నిర్వర్తించగా,అదనపు ఎస్పీ రితిరాజ్ రాత పరీక్షను పర్యవేక్షించారు.ఈ అర్హత రాత పరీక్షకు 438 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం,డీజీపీ ఆదేశాల మేరకు ముందస్తు ఉచిత శిక్షణకు జిల్లా పోలీసు ప్రణాళిక చేసినది.దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన పీజికల్ టెస్ట్ నిర్వహించాము,ఫిజికల్ టెస్ట్ నందు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈరోజు అర్హత రాత పరీక్షా నిర్వహించామని అన్నారు.

అభ్యర్థులు రాజీ లేకుండా ప్రయత్నం చేయాలని,కష్టపడి చదువుకోవాలని,ప్రతి అంశాన్నీ కొత్తగా నేర్చుకోవాలని యువతకు సూచించారు.నైపుణ్యం ఉంటే పోటీల్లో ముందుంటామని,యువత జిల్లా పోలీసు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండని,చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని,ఆదర్శంగా ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి అండగా ఉండాలని కోరారు.

కానిస్టేబుల్,ఎస్ఐ నియామకాల్లో సూర్యాపేట జిల్లా నుండి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.యువత రాజీ లేకుండా ప్రయత్నించి విజయాన్ని పొందాలని తెలిపారు.శిక్షణకు సంబంధించిన తదుపరి వివరాలను మీడియా ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు మోహన్ కుమార్,రవి,ఉచిత శిక్షణ నోడల్ అధికారి ప్రవీణ్, ఎస్బిఐ శ్రీనివాస్,మునగాల సీఐ ఆంజనేయులు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ,సీసీఎస్ సీఐ రవి, ఎస్ఐలు శివ కుమార్,డానియల్,లింగం,నరేష్, మహేష్,అంజిరెడ్డి,ఐలయ్య,భరత్,శంకర్,వీరన్న, కొండల్ రెడ్డి,రాంబాబు,మహేందర్ నాథ్,గిరి,క్రాంతి కుమార్,అన్వర్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube