సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు ఘాటులో గణేష్ నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శనివారం ఆయన కోదాడ పెద్ద చెరువు ఘాటును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని,చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని,ఊరేగింపులో డీజేలు పెట్టరాదని,ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులకు సహకరించాలన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి,సిఐ రాము, పోలీస్,మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.