చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు కొంతమంది సీనియర్ సెలబ్రిటీస్ మొదటినుంచి ఓల్డ్ ఏజ్ వచ్చేంతవరకు యాటిట్యూడ్ చూపిస్తూ అందరికీ చిరాకు తెప్పిస్తున్నారు.వారి మెంటాలిటీ ఎప్పుడూ అలాగే ఉంటుంది.
ఒకరిపై ఆధిపత్యం చెలాయించేలాగా వారు మాట్లాడతారు.తామే గొప్ప వారం అన్నట్లు ఫీల్ అయిపోతుంటారు.
యాటిట్యూడ్ తమ జన్మ లక్షణం అన్నట్లు వీళ్లు ప్రవర్తిస్తారు.మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అంత బలుపు చూపించే వారెవరో తెలుసుకుందాం.
• విజయ కృష్ణ నరేష్
రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమ, జంబ లకిడి పంబ వంటి సినిమాల్లో హీరోగా నటించి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు నరేష్.( Actor Naresh ) ఈ యాక్టర్ ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్నాడు.
వారిలో నటి పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) కూడా ఉంది.వీరిద్దరిది అఫైర్స్ చాలా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో నరేష్ చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు.ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకుంటానన్నట్లు రెచ్చిపోయాడు.నిజానికి మొదటి నుంచి నరేష్ బలుపు చూపిస్తూనే వచ్చాడు.“నీకేం తెలుసు నాకే అన్ని తెలుసు” అని అందరిపై నరేష్ ఆధిపత్యం చెలాయించేవాడు.ఇప్పటికీ అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.సినిమాలో పక్కన పెడితే బయట ఈ నటుడు బాగా యాటిట్యూట్ చూపిస్తూ ఇతరులకు చిరాకు కలిగిస్తాడట.

• కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
మోహన్ బాబు( Mohan Babu ) కూడా చాలా పొగరుగా మాట్లాడతారు.అందరినీ మందలిస్తూ ఉంటారు.ఎవరైనా తన ముందు ఫోన్ మాట్లాడుతుంటే ఆయనకు బాగా కోపం వస్తుంది.ఆ ఫోన్ లాగేసుకుని ఎవరితో మాట్లాడుతున్నావు అని ముఖం మీద అనేస్తారు.అంతేకాదు, ఆ ఫోన్లో ఉన్న పేరు చూసి “ఈడికి నాకంటే ఏం తెలుసు, నాకే అన్నీ తెలుసు” అని సొంత బజనతో కూడిన యాటిట్యూడ్ చూపించడం మొదలు పెడతాడట.

• అల్లు అరవింద్
అల్లు అరవింద్( Allu Aravind ) సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు బహుశా ఏ నిర్మాత కూడా కొట్టుకోడేమో అని చెప్పవచ్చు.ఈ నిర్మాత మన సినిమా మన బడ్జెట్ మన హీరో నా కొడుకు నేషనల్ అవార్డు విన్నర్ అంటూ ఓన్లీ తన గురించే ఎక్కువగా చెప్పుకుంటాడు.తన సినిమా సూపర్ హిట్ అయినా, భారీ ఎత్తున కలెక్షన్స్ రాబట్టినా తన సినిమాలోని నటీనటులకు మాత్రమే ఎక్కువగా డబ్బులు ఇవ్వడు.
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే ఒక మనీ మైండెడ్ యాటిట్యూడ్ చూపిస్తాడు.

• దిల్ రాజు
ఈ నిర్మాత కూడా కొన్ని సమయాల్లో తల పొగరుగా మాట్లాడతాడని అంటారు.కొన్నిసార్లు ఈ నిర్మాత పలు కాంట్రవర్సీలో కూడా చెప్పుకున్నాడు.