పండుగలా దశాబ్ది ఉత్సవాలు: మంత్రి జగదీష్ రెడ్డి...!

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్టాన్ని సాధించిన ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీదేనని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీఆర్ఎస్ విజయమని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో జరిగిన సూర్యాపేట రూరల్ మండల బీఆర్ఎస్ కుటుంభసభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి పది సంవత్సరాలు అవుతున్న సందర్బంగా జరుపుకోబోయే దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన పండుగలా నిర్వహించాలని సూచించారు.

 Minister Jagadish Reddy About Telangana State Formation Dashabdhi Celebrations,-TeluguStop.com

పండుగలా జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవడంతో పాటు ఊరు ఊరు కదలి రావాలని కోరారు.కేసీఆర్ నాయకత్వంలో 9ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సాధించిందని అన్నారు.2014 కు ముందు ఉన్న వలసలు ఆగిపోయి ముప్పై లక్షల మందికి వలస కార్మికులకు ఆశ్రయం కల్పిస్తున్న ఘనత మన తెలంగాణకు దక్కిందన్నారు.ఈ విజయం ముమ్మాటికీ కేసీఆర్,ఆయన వెనుక ఉన్న తెలంగాణ ప్రజలదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2 నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్నారు.

పెద్ద ఎత్తున పోరాటాలు,ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సుగల రాష్ట్రమని, అయినా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్య సమష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల ఆశ్చర్యానికి గురవుతున్నారన్నారు.

మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు,ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్య పోతున్నారని,వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదు చేసుకుంటున్నమన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపిపి బీరవోలు రవీందర్ రెడ్డి,జడ్పీటిసి జీడి భిక్షం, మండల పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఎంపిపి రామసాని శ్రీనివాస్ నాయుడు,సర్పంచులు, ఎంపిటిసిలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube