వచ్చే ఎన్నికలు ఇటు వైసీపీకి( YCP ) అటు టీడీపీకి( TDP ) రెండు పార్టీలకు కూడా ఎంతో కీలకం.అధికారాన్ని నిలుపుకునేందుకుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే.
అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు కాకరేపుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ధీమాగానే ఉన్నప్పటికి.ఎక్కడో చిన్న బెరుకు కూడా కనిపిస్తోంది.
ఎందుకంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతే అందుకు కారణం.ఈ వ్యతిరేకతను అధిగమించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం వైసీపీ ముందు ఉన్న అతి పెద్ద సవాల్.

అంతే కాకుండా ప్రస్తుతం పార్టీలో కూడా అంతర్మధనం గట్టిగానే జరుగుతోంది.ఒకవైపు వివేకా హత్యకేసు మరోవైపు పార్టీలో అసంతృప్త జ్వాలలు, ఇంకోవైపు ప్రజా వ్యతిరేకత ఇలా అన్నీ కూడా ప్రస్తుతం వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.వీటితోనే సతమతమౌతున్న వైఎస్ జగన్ ( YS Jagan )కు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది.ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు మహానాడు వేధికగా టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించారు.
దాంతో ఇప్పుడు రాష్ట్రంలో అందరినోట టీడీపీ మేనిఫెస్టోకు సంబంధించిన చర్చే జరుగుతోంది.ఇదిలాగే కొనసాగితే టీడీపీకి అనూహ్యంగా మైలేజ్ పెరిగి వైసీపీ ఓటు బ్యాంక్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
దీంతో టీడీపీ మేనిఫెస్టో( TDP Manifesto ) నుంచి ప్రజల దృష్టి మళ్లించాలంటే వైసీపీ కూడా మేనిఫెస్టో ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.అసలు దానిపై కసరత్తులు జరుగుతున్నాయా ? లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.ఒకవేళ ఎలాంటి రూపకల్పన లేకుండా మేనిఫెస్టో రూపొందిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే గత మేనిఫెస్టోలో ప్రకటించిన మద్యపాన నిషేదం, సిపిఎస్ రద్దు వంటి అంశాలను నెరవేర్చలేదని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు.ఇప్పుడు కూడా మేనిఫెస్టో విషయంలో అలాంటి తప్పు జరిగితే ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దాంతో వైఎస్ జగన్ మేనిఫెస్టో విషయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మరి వైఎస్ జగన్ ఈ ఒత్తిడిని ఎలా అధిగమిస్తారో చూడాలి.