మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఇందులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.

 Role Of Micro Observers Is Crucial District Election Officer Collector S Venkat-TeluguStop.com

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27 న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లతో ఏర్పాటు చేసిన శిక్షణాకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్.ప్రియాంకతో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని,ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

పోలింగ్ రోజున చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించుకోవాలని,అలాగే ఓటర్లు ఎక్కువగా ఎపిక్ కార్డులు వినియోగించుకునేలా చూడాలని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన 12 గుర్తింపు కార్డులు చూపి ఓటుహక్కు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 22 కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్నారని, అన్నిచోట్లా రెండు జంబో బాక్స్ లు ఏర్పాటు చేయనున్నట్లు, అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని పిఓ డైరీలో నమోదయ్యేలా చూడాలని, అదేవిదంగా సీలింగ్ ప్రాసెస్ ను నిచితంగా పరిశీలన చేయాలన్నారు.పోలింగ్ కేంద్రాలకు 26న నియమించిన సిబ్బందితో వెళ్ళవలసి ఉంటుందని,ముఖ్యంగా ఎన్నికల్లో నియమించిన అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు.

తదుపరి మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు చేపట్టే విధివిధానాలను వివరించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో నోడల్ అధికారి ఏడిఏ శ్రీధర్ రెడ్డి,ఎల్.

డి.ఎం.బాపూజీ,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు,మాస్టర్ ట్రైనర్లు రమేష్,వెంకటేశ్వర్లు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube