317 జీవో బాధితుల గోడు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) కి 317 జీవో బాధితులు తమ గోడును వివరిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఆ లేఖలో 317 జీవో వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు.

 317 Gio Victims Wall-TeluguStop.com

పోలీస్ శాఖలో 10 ఏళ్లుగా సర్వీసులో ఉండి మా స్థానికతను వదులుకొని పక్క జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాము.ఇప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయి కొత్తగా ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఈ జీవో వల్ల తన సొంత జిల్లాలో ఉద్యోగం చేస్తాడు.

పది సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా మేము వేరే జిల్లాలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది.మా బాధను సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలని కోరారు.

మీరు తెచ్చిన 317 జీవో తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే మీ స్థానికత మీకే ఉండదన్న మాటను నిజం చేసినట్లు అవుతుంది.అలా జరగకుండా చూడండి.

మీరు ఎప్పుడూ ఉద్యోగస్తుల గురించి ఆలోచిస్తారని అంటుంటారు.పోలీస్ శాఖలో సుమారు 20 వేల కుటుంబాలు 317 జీవో వల్ల తమ తల్లిదండ్రులను, తమ సొంత ఇల్లును, భూమిని వదులుకొని వేరే జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు.

తమ పిల్లలు వేరే జిల్లాలో చదవడం వల్ల వాళ్ల సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలో స్థానికులుగా ఉంటారు.కావున మా యందు దయవుంచి 317 జీవోను సవరించి,మా స్థానిక జిల్లాకు మమ్మల్ని కూడా పంపించాలని కోరుకుంటున్నామని వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube