పార్టీ మార్పు అంటూ వస్తున్న ఊహాగానాలు అన్ని పుకార్లే:మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Ram Reddy Damodar Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు.సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనికట్టుకుని బీఆర్ఎస్ తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారని,నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరమని, దయచేసి ప్రజలు, కార్యకర్తలు ఎవరూ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ నన్ను సంప్రదించలేదని,నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదని,నా పుట్టుక కాంగ్రెస్ అని, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నానని,టికెట్ నాదే గెలుపు కూడా నాదేనని,ఇందులో ఎలాంటి అనుమానం, కన్ఫ్యూషన్ లేదని,లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదన్నారు.40 సంవత్సరాలు సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మిత్రులు గమనించాలని,ఎవరూ పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచానని,రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశానని,ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చానని, గతంలో చంద్రబాబు, టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ పార్టీలోకి రావాలని కోరినా వెళ్ళలేదని గుర్తు చేశారు.ఇప్పడు కావలసింది ప్రతిపక్ష నాయకుల పార్టీ మార్పుపై దృష్టి పెట్టడం కాదని,వర్షాలతో నష్టపోయిన ప్రజలకి, రైతులకు చేయూత అందించండని సూచించారు.నాకు గ్రూపులు లేవని,నాది కాంగ్రెస్ గ్రూపు,సోనియా గ్రూపు అని,పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని,పార్టీ మార్పు కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 Speculations About Party Change Are All Rumours Former Minister Ram Reddy Damoda-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube