సూర్యాపేట జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు ఆర్టీసి బస్సులు ఆదివారంషార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైయ్యాయి.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామం వద్ద 65వహైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రోడ్ మీద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
ఈ క్రమంలో మరో బస్సు సహాయంతో సెల్ఫ్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో బస్సుల్లో మంటలు చెలరేగి రెండు బస్సులు దగ్ధమైమయ్యాయి.
సమాచారం అందుకున్న చివ్వెంల ఎస్సై విష్ణు,ఫైర్ అధికారి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ సమయంలోబస్సుల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా,ఏపీఎస్ ఆర్టీసీ దర్యాప్తు చేస్తుంది.