ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ముందుగా చూసినప్పుడు ఎవరైనా ఇది సైకిల్ అనే అనుకుంటారు.రైడ్1 అప్ కంపెనీ మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి అనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని, width=553 height=465 తో సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్ ”రోడ్ స్టర్ V2 గ్రావెల్ ఎడిషన్” ను లాంచ్ చేసింది.దీని బరువు కేవలం 15 కేజీలు మాత్రమే, అవసరమైన సందర్భాల్లో మోసుకొని తీసుకువెళ్లొచ్చు.ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి సింపుల్ గా ఉంటూ, ఫాస్ట్ గా వెళ్లేలా కంపెనీ దీనిని తయారు చేసింది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్నప్పుడు సైకిల్ నడిపే అనుభూతిని పొందవచ్చు.ఈ ఎలక్ట్రిక్ బైక్ వైర్లు బయటకు కనిపించకుండా ట్యూబ్ లలో ఉంటాయి.దీనికి లైట్స్, కిక్ స్టాండ్, పెండర్స్ లాంటివి ఉండవు.ఒక బెల్ లెఫ్ట్ బ్రేక్ వైపు ఉంటుంది.ఈ బైక్ యొక్క బ్యాటరీ ఫ్రేమ్ లో సెట్ చేయబడి ఉంటుంది.36 ఓట్ల పవర్ తో ఉండే ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 32 కిలోమీటర్లు, కాస్త పెడల్స్ తొక్కుతూ వెళ్తే 38 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

బ్యాటరీని బైక్ నుండి విడదీయడానికి అవకాశం ఉండదు.ఎటువంటి ప్రదేశాలలోనైనా సులువుగా దీనిపై ప్రయాణం చేయవచ్చు.ఈ బైక్ ఎంత స్పీడ్ గా వెళ్తుందో హ్యాండిల్ బార్ పై కాంఫాక్ట్ LCD డిస్ప్లే లో కనబడుతుంది.ఈ బైక్ కు 350w గేర్ కలిగిన హబ్ మోటర్ ఉండడంతో, 40Nm టార్క్ ఇస్తుంది.పైగా 160mm డిస్క్ బ్రేకులు ఉండడం వల్ల సడన్ బ్రేకులు వేసిన ప్రమాదం ఏమీ ఉండదు.6061 అల్యూమినియం అలాయి ఫ్రేమ్ ఉండడంతో రోడ్లపై మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఫ్రేమ్ జామెట్రీ ఉంటుంది.ఈ రోడ్ స్టర్ V2 లో 52 సెంటీమీటర్లు, 58 సెంటీమీటర్లు కలిగిన రెండు ఫ్రేమ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండడంతో పాటు నాలుగు కలర్స్ లలో అందుబాటులో ఉంటుంది.దీని ధర రూ.1,095 డాలర్లు ( రూ.90803) ఉండగా, రైడ్ 1 అప్ వెబ్సైట్లో 69 డాలర్లు (రూ.5721) తో బుక్ చేసుకోవచ్చు.







