నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వం తెచ్చిన ధరణీ ఫోర్టల్ వల్ల రెండు ఎకరాల భూమి నష్టపోయాం.ఆర్ఐ ఫీల్డ్ విచారణ నివేదిక ఇచ్చినా తహశీల్దార్ పట్టించుకోవడం లేదు.
ఎన్నిసార్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా న్యాయం జరగడం లేదని నల్లగొండ జిల్లా పెద్దవూర ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గురువారం బాధిత కుటుంబ సభ్యులు న్యాయం చేయండి లేదా తమకు కారుణ్య మరణానికి అనుమతైనా ఇవ్వండి అంటూ నిరసనకు దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన ధరణి తప్పిదాల వల్ల మమ్ముల్ని అన్యాయం చేయొద్దని,రెండు ఎకరాల భూమిని ధరణి వల్ల కోల్పోయామని,గతంలో ధరణిలో జరిగిన అవకతవకలు కారణం వల్ల మాభూమి వేరే వారిపై ఎక్కించారని,ఆర్ఐ ఫీల్డ్ మీదకు వచ్చి సరియైన రిపోర్ట్ ఇచ్చినా ఎమ్మార్వో మాత్రం స్పందించడం లేదని,ఇక ప్రభుత్వమే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ భూమిని తమకు ఇప్పించాలని ఎమ్మార్వో ఆఫిస్ మెట్లు ఎన్నోసార్లు ఎక్కి మొరపెట్టుకున్నా ఎమ్మార్వో కనికరం చూపడం లేదంటూ ఆరోపించారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయండి లేదంటే తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతైనా ఇవ్వండని వేడుకున్నారు.