హెచ్ 1 బీ వీసాలకు ఓకే .. కానీ సంస్కరణలు కావాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ( Donald Trump ) ది ఇమ్మిగ్రేషన్ విభాగంలో కఠిన వైఖరి అన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిందే.తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇమ్మిగ్రేషన్ అంశంతోనే ప్రజల్లోకి వెళ్లి ఘన విజయం సాధించారు.

 Us President Elect Donald Trump Backs H-1b Visa Sysetem , H-1b Visa Sysetem, Us-TeluguStop.com

అయితే ట్రంప్ ఎన్నిక కావడంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఇక అమెరికాలో ఆల్రెడీ ఉంటున్న వారు కూడా పెద్దాయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని భయపడుతున్నారు.

Telugu Calinia, Donald Trump, Elon Musk, Visa Sysetem, Hb Visa, Citizenship, Ele

అయితే హెచ్ 1 బీ వీసాకు( H1B visa ) సంబంధించి ట్రంప్ సన్నిహితుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ( Elon Musk )చేసిన వ్యాఖ్యలు MAGAలో చాలా ఆగ్రహాన్ని రేకిత్తించింది.టెక్, నైపుణ్యం కలిగిన కార్మికుల విషయంలో ఇబ్బందులు చోటు చేసుకోకూడదని పలువురు వ్యాపారవేత్తలు కోరుతునున్నారు.అమెరికా సంయుక్త రాష్ట్రాలలో హెచ్ 1 బీ వీసాపై అత్యధికంగా ఆధారపడుతున్న రాష్ట్రం కాలిఫోర్నియా( California ).2024 ఆర్ధిక సంవత్సరంలో కాలిఫోర్నియాకు చెందిన 9600 మంది యజమానులు కనీసం ఒక్క హెచ్ 1 బీ క్లియరెన్స్ కోసమైనా ప్రయత్నించారని గణాంకాలు చెబుతున్నాయి. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) డేటా ప్రకారం.కొత్త, నిరంతర ఉపాధి కోసం దాదాపు 78,860 వీసా దరఖాస్తులు ఆమోదించబడ్డాయి.

Telugu Calinia, Donald Trump, Elon Musk, Visa Sysetem, Hb Visa, Citizenship, Ele

నర్సులు, సైన్స్, ఉపాధ్యాయులు సహా వివిధ పరిశ్రమలలో అన్ని రకాల నైపుణ్యం కలిగిన వారు ఉంటారు.కానీ కాలిఫోర్నియాలో మాత్రం హెచ్ 1 బీ వీసాల లబ్ధిదారుల్లో ఎక్కువ భాగం టెక్ దిగ్గజాలే ఉన్నాయి.హెచ్ 1 వీసాపై తాజా వివాదం నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.ఇది గొప్ప కార్యక్రమమని.తాను వీసాలను ఎప్పుడూ ఇష్టపడతానని, వాటికి అనుకూలంగా ఉంటానని అన్నారు.నేను హెచ్ 1 బీని నమ్ముతున్నానని, దీనిని చాలాసార్లు ఉపయోగించానని ట్రంప్ స్పష్టం చేశారు.

అయితే ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను మెరిట్ ఆధారితంగా మార్చడానికి ట్రంప్ మద్ధతు ఇచ్చారు.కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల మాదిరిగా పాయింట్ల విధానంపై ఆయన కసరత్తు చేస్తున్నారు.

ఇది విద్య, ఉద్యోగ అర్హతలకు వెయిటేజీ ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube