టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమాకు కమిట్ అయ్యారు.
ఇక ఈ ఏడాది రోజులు రాజమౌళి సినిమా పనులలో మహేష్ బాబు బిజీగా ఉన్నారు.ఇప్పటివరకు కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు వర్క్ షాప్ వంటివి పూర్తి అయ్యాయి అయితే ఈ ఏడాది నుంచి షూటింగ్ పనులు జరుగుతాయి అంటూ గతంలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు అయితే తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకున్నారని తెలుస్తుంది.

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రాజమౌళి ఈ సినిమా పూజ కార్యక్రమాలను హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించారని తెలుస్తుంది.అయితే ఈ సినిమా కోసం గత 17 సంవత్సరాల నుంచి మహేష్ బాబు ఫాలో అవుతున్నటువంటి ఒక సెంటిమెంట్ బ్రేక్ చేశారని తెలుస్తుంది.సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని రకాల సెంటిమెంట్స్ ఉంటాయి.మహేష్ బాబు ఒక్కడు సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఈయన తన సినిమా టైటిల్స్ విషయంలో సెంటిమెంట్ ఫాలో అయ్యేవారట.
తన సినిమాలు మూడు అక్షరాలతో వస్తే కనుక మంచి హిట్ అవుతుందని భావించే వారట.

ఇకపోతే తన సినిమా పూజా కార్యక్రమాలకు ( Pooja Cermony ) మహేష్ బాబు దూరంగా ఉంటారు.ఈయన పూజ కార్యక్రమాలలో పాల్గొనరు.తనకు బదులుగా తన భార్య నమ్రత( Namrata ) ఇతర కుటుంబ సభ్యులు ఈ పూజ వేడుకలలో పాల్గొంటూ ఉంటారు.
మొదటిసారి రాజమౌళి సినిమా కోసం తన 17 సంవత్సరాల సెంటిమెంటును పక్కనపెట్టి ఈ సినిమా కార్యక్రమాలలో మహేష్ బాబు పాల్గొన్నారని తెలుస్తోంది.మహేష్ బాబు కారు రావడం వీడియోలో రికార్డు అయ్యింది.
రాజమౌళి పిలుపు మేరకే వచ్చారని తెలుస్తుంది.ఈయనతో పాటు నమ్రత కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.







