సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సూర్యాపేట టౌన్ ఎస్సై సైదులు తెలిపారు.సుమారు 60 ఏళ్ళ వయస్సున్న వృద్ధుడి మృతదేహం చెరువులో ఉండడం మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం అందించారని,ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు.ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే టౌన్ ఎస్సై సైదులు cell.8712582352, పట్టణ సీఐ రాజశేఖర్ 8712686005 ఈ నంబర్లకు సమాచారం అందించాలని అన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




Latest Suryapet News