నల్లగా పుట్టడమే పశువులు చేసిన పాపమా?

జాతీయ రహదారులపై ప్రతి ఏటా పశువుల మృత్యువాత.వాహనాలు ఢీకొని పది కిలోమీటర్ల మేర పది పశువులు మృతి.

 Is It A Sin For Cattle To Be Born Black?-TeluguStop.com

వేసవి కాలం కావడంతో పశువులను బయటికి వదిలేస్తున్న రైతులు.

సూర్యాపేట జిల్లా:వేసవి కాలంలో సహజంగానే రైతులు తమ పశువులను విడిచి పెట్టడం అనాదిగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో కొన్ని పశువులు మేతకు వెళ్లి సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటాయి.కొన్ని మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతుంటాయి.ఈ క్రమంలో అత్యంత వేగంగా వాహనాల రాకపోకలు సాగించే జాతీయ రహదారులు దాటవల్సిన పరిస్థితి ఉంటుంది.పగటి పూటనే ఒక్కోసారి దగ్గరకు వచ్చే వరకు గేదెలు కనిపించక ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇక రాత్రి వేళల్లో అయితే గేదెల వల చాలా ప్రమాదకరంగా ఉంటుంది.చిన్న వాహనాలైతే మనుషుల ప్రాణాలు పోతాయి,భారీ వాహనాలైతే గేదెల ప్రాణాలు పోతుంటాయి.

ప్రతి వేసవిలో ఇలాంటి మరణాలు సర్వసాధారణం అయిపోయాయి.గేదెలు రాత్రిపూట రోడ్లపై తిరుగుతూ వచ్చిపోయే వాహనాలు ఢీకొని పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుంటాయి.

గేదెలు నల్లగా ఉండడంతో డ్రైవర్లకు సరిగా కనిపించక పోవడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.అయితే రోడ్ల వెంట మృత్యువాత పడ్డ గేదెలను గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ,ఆర్ అండ్ బి అధికారులు కానీ,పట్టించుకోవడం లేదు.

గేదెలు మృతి చెందిన తర్వాత వాటి నుంచి వచ్చే వ్యర్ధ వాసనతో రహదారి వెంట ప్రయాణిస్తున్న ప్రయాణికులు,పరిసర ప్రాంతం ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.గేదెల చెవులకు ట్యాగులు వేసినటువంటి పశుసంవర్ధక శాఖ ఇలా పదుల సంఖ్యలో గేదెలు మృతి చెందుతున్నా ఏం చేస్తున్నారనేది అర్థం కాని విషయం.

ప్రజలకు రోజువారీ దినచర్యలో భాగంగా గేదెలు ఇచ్చేటువంటి పాలతో ఎన్నో రకాల అవసరాలు తీరుతున్నాయి.ఇలా ప్రతీ యేడు కోదాడ-సూర్యాపేట,కోదాడ-మిర్యాలగూడ రహదారులు పశువుల మృత్యు కూపంగా మారాయి.

కేవలం నేరేడుచర్ల నుండి హుజూర్ నగర్ వెళ్లే జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో గేదెలు మృత్యువాత పడ్డాయి.మునగాల నుండి సూర్యాపేట పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

రానున్న రోజుల్లో పాల ఉత్పత్తిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు వాపోతున్నారు.రైతులు ఇకనైనా పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube