ఒక్కోసారి ఒంట్లో ఎనర్జీ లెవల్స్ పూర్తిగా డౌన్ అయిపోతుంటాయి.ఈ సమయంలో ఏ పని చేయలేకపోతుంటారు.
వేటిపైనా ఇంట్రస్ట్ చూపలేకపోతుంటారు.అసలు మంచంపై నుండి లెవడానికి కూడా శరీరం సహకరించదు.
అయితే అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే గనుక.డౌన్ అయిపోయిన ఎనర్జీ లెవల్స్ మళ్లీ రైస్ అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హారాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
బెర్రీలు.
.శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
అందుకే ఒంట్లో ఓపిక లేనప్పుడు బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిని తీసుకుంటే చాలా మంచిదని అంటున్నారు నిపుణులు.
అరటి పండు.
ధర తక్కువే అయినా పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి.ఎనర్జీ లెవల్స్ డౌన్ అయినప్పుడు ఒక అరటి పండును తీసుకుంటే వెంటనే బాడీ యాక్టివ్‌గా మరియు ఎనర్జిటిక్‌గా మారుతుంది.

గ్రీన్ టీ..ఇది కేవలం బరువును తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తారు.కానీ, గ్రీన్ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
గ్రీన్ టీ ఎనర్జీ బూస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.నీరసంగా ఉన్నప్పుడు ఒక కప్పు గ్రీన్ టీని తీసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది.

నట్స్. ఖరీదైనవే కాదు ఆరోగ్యకరమైనవి కూడా.వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ బాగా పెరుగుతాయి.అసలు రోజూ ఉదయాన్నే గుప్పెడు నట్స్ తింటే ఎనర్జీ లెవల్స్ తగ్గనే తగ్గవు.

సోయా బీన్స్. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇవీ ఎంతగానో సహాయపడతాయి.సోయా బీన్స్‌ను తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ అమాంతం పెరగడం ఖాయం.ఇక ఇవే కాకుండా నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు, కాఫీ, డార్క్ చాక్లెట్ వంటివి కూడా ఎనర్జీ లెవల్స్ ను పెంచడానికి హెల్ప్ చేస్తాయి.