ప్రతి అమ్మాయి అందమైన మచ్చలు లేని చర్మం ఉండాలని కోరుకుంటుంది.అయితే మనకు ఎన్నో చర్మ సమస్యలు ఎదురు అవుతూ ఉంటాయి.
వాటిలో వైట్ హెడ్స్ ఒకటి.ఇవి ముక్కు, చెంపలు, నుదురు మరియు కణతలపైనా ఎక్కువగా కనిపిస్తాయి.
వైట్ హెడ్స్ మేకప్ ఎక్కువగా వేసుకోవటం,ఎండలో ఎక్కువగా తిరగటం,యుక్తవయస్సులో వచ్చే హార్మోన్ల మార్పు, చర్మంలో నూనె ఉత్పత్తి అధికంగా ఉండటం వంటి కారణాలతో ఎక్కువగా వస్తూ ఉంటాయి.వీటిని ఇంటిలోనే సులభంగా తొలగించుకోవచ్చు.
వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
యాపిల్ సిడర్ వెనిగర్యాపిల్ సిడర్ వెనిగర్ లో ఉండే యాస్ట్రిజంట్ లక్షణాలు చర్మంలో అధికంగా ఉత్పత్తి అయ్యే నూనెను తొలగించడంలో సహాయపడుతుంది.
అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ లో ఉండే యాంటీబాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబియల్ లక్షణాలు మంటను తగ్గిస్తాయి.ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ను కలిపి ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
తేనెతేనెలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు వైట్ హెడ్స్ ను సమర్ధవంతంగా తొలగిస్తాయి.తేనె చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తుంది.తేనెను కొంచెం వేడి చేసి వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
నిమ్మరసంనిమ్మరసంలో ఉండే యాస్ట్రిజంట్ గుణాలు చర్మంపై అధికంగా ఉన్న నూనెలను తొలగిస్తాయి.వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో నిమ్మరసాన్ని రాసి 20 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
టూత్ పేస్ట్టూత్ పేస్ట్ కొన్ని గంటల్లోనే వైట్ హెడ్స్ ను ఎండిపోయేట్టు చేస్తుంది.వైట్ హెడ్స్ ను తొలగించడానికి తెల్లని టూత్ పేస్ట్ ను మాత్రమే వాడండి.
వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో టూత్ పేస్ట్ రాసి బాగా ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఇలా రోజులో రెండు సార్లు చేస్తే వైట్ హెడ్స్ తొలగిపోతాయి.