చందుమొండేటి దర్శకత్వంలో, నిఖిల్ కలర్స్ స్వాతి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కించారు.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది అయితే ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే నెలకు పోస్ట్ పోన్ అయింది.

ఈనెల 22వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల అవుతూ మెగాస్టార్ చిరంజీవికి గట్టి పోటీగా నిలబడుతుందని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఏవి విడుదల కాకున్నా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా ప్రివ్యూ చూసిన మెగాస్టార్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా అదే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవితో ఈ యంగ్ హీరోలు ఇద్దరు పోటీ పడిపోతున్నారు మరి ఈ ముగ్గురిలో ఎవరు విజయం అందుకుంటారో తెలియాల్సి ఉంది.







