పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తన అద్భుతమైన ఆట తీరుతో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.తాజాగా విరాట్ కోహ్లీ, ధోనీ, సచిన్ వంటి దిగ్గజ ఆటగాళ్లకే సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును బాబర్ అజామ్ నెలకొల్పాడు.
క్రికెట్ చరిత్రలోనే ఏ బ్యాటర్ చేయలేని విధంగా 7 వన్డేల్లో, వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేశాడు.శుక్రవారం వెస్టిండీస్ టీమ్‌పై జరిగిన రెండో వన్డేలో పాక్ కెప్టెన్ 77 పరుగులు చేశాడు.
దీంతో వన్డేలు, టీ20లు, టెస్ట్ ఫార్మాట్‌లలో వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో అర్థ శతకాలు చేసినట్లయింది.అలా ఈ ఘనత క్రియేట్ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా బాబర్ అజామ్ నిలిచాడు.
ఏయే తేదీల్లో బాబర్ 50కిపైగా రన్స్ చేశాడో తెలుసుకుంటే.ఈ ఏడాది మార్చి 12న ఆస్ట్రేలియాతో జరిగిన 2వ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ 196 స్కోరు సాధించాడు.
మార్చి 21న ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో 67 పరుగులు, 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మార్చి 29న మళ్లీ పాక్, ఆసీస్ మధ్య వన్డే సిరీస్ జరిగింది.ఈ సిరీస్‌లో తొలి వన్డేలో బాబర్ 57 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు.రెండో వన్డేలో ఏకంగా 114 రన్స్ చేశాడు.
అనంతరం జరిగిన మూడో వన్డేలో 105 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.ఆ తర్వాత ఆడిన వన్డేల్లో, ఒక టీ20లో కూడా అర్థ శతకం బాదాడు.
అలా ఒక భారీ రికార్డును సృష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.