సూర్యాపేట జిల్లా:ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 10 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.
ప్రతి ఫిర్యాదుదారితో మాట్లాడి సమస్యల తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.సమస్యలపై త్వరగా చర్యలు తీసుకుని వారికి భరోసా కల్పించాలన్నారు.
ప్రజలు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.చలికాలం దృష్ట్యా రాత్రివేళ రోడ్డు ప్రయాణం సమయంలో వాహనదారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రమాదకరమైన ప్రయాణం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.