రాజధాని బస్సు బైక్ ఢీ స్కూటరిస్ట్ మృతి, బస్సు దగ్దం...!

సూర్యాపేట జిల్లా: టిఎస్ ఆర్టీసి రాజధాని బస్సు స్కూటీని ఢీ కొట్టడంతో బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దం కాగా, స్కూటీపై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన 65వ జాతీయ రహదారిపై మునగాల మండలం ఇంద్రనగర్ వద్ద జరిగింది.గురువారం హైదరబాద్ లోని మియాపూర్ నుండి బయలుదేరి విజయవాడ వెళ్తున్న టిఎస్ ఆర్టీసికి చెందిన రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇంద్ర నగర్ వద్దకు రాగానే ముందు వెళుతున్న స్కూటీని ఢీ కొట్టింది.

 Rajdhani Bus Bike Collides Scooterist Died Bus Catches Fire In Suryapet, Rajdhan-TeluguStop.com

దీనితో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్‌ అప్పమత్తమై ప్రయాణికులు హుటాహుటిన కిందకు దించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.స్కూటీపై వెళుతున్న ఇంద్రనగర్ కి చెందిన మురుగేస్ రాజు (45) తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.

అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube