గంజాయి,డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన ర్యాలీ

సూర్యాపేట జిల్లా( Suryapet District): గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పెన్ పహాడ్ ఎస్ఐ రవీందర్ సూచించారు.గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

 Awareness Rally On Control Of Ganja And Drugs , Suryapet District , Si Ravin-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు.

ప్రధానంగా గంజాయి,డ్రగ్స్‌ ( Marijuana, drugs )వంటి మత్తు పదార్థాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటు పడకూడదన్నారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై మండలంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ప్రధానంగా గంజాయి వినియోగం,రవాణాకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు.విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ వల్ల వ్యక్తిగతంగా తమకు,సమాజానికి కలిగే నష్టాలను గుర్తించాలని, వాటిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని ఎస్‌ఐ సూచించారు.గంజాయి,డ్రగ్స్‌ వినియోగం,రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమం పోలీసు సిబ్బంది,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube